బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడి సినిమాలో మ‌రోసారి దుసారా

Jul 31 2021 @ 14:56PM

హీరో ఆర్య, దర్శకుడు పా.రంజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్ప‌ట్ట ప‌రంప‌ర‌(సార్ప‌ట్ట‌ పరంబరై)’ ఇటీవల ఓటీటీలో విడుదలైన సంగ‌తి తెల‌సిందే. ఈ చిత్రంలో ఆర్య భార్యగా దుసారా విజయన్‌ నటించారు. ఆమె న‌ట‌న‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.  అదేసమయంలో ఆమెకు వరుస అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు వసంతబాలన్‌ దర్శకత్వం వహించే చిత్రంలో అర్జున్‌ దాస్‌ సరసన దుసారా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.  కాగా ఇప్పుడు ఆమె మరో లక్కీఛాన్స్‌ కొట్టేశారు. హీరోయిన్‌గా త‌న‌కు బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు పా.రంజిత్‌ తెరకెక్కించనున్న తరువాత చిత్రంలోనూ దుసారా హీరోయిన్‌గా న‌టింనున్నారు. ‘నక్షత్రం నగర్‌గిరదు’ అనే పేరుతో రూపొందే ప్రేమ కథా చిత్రంలో అశోక్‌ సెల్వన్‌, జయరాం తనయుడు కాళిదాస్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా దుసారాను ఎంపిక చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.