యోగా గురు ఆశ్రమంలో సుశీల్‌?

May 15 2021 @ 03:54AM

న్యూఢిల్లీ: హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, సుశీల్‌ హరిద్వార్‌లోని ఓ ప్రముఖ యోగా గురు ఆశ్రమంలో ఉన్నట్టు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. సుశీల్‌ స్నేహితుడు, రోహ్‌తక్‌కు చెందిన భూరా.. ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పాడట. స్వయంగా తానే హరిద్వార్‌లోని యోగా గురు ఆశ్రమానికి తీసుకెళ్లినట్టు తెలిపాడట. ఈ నెల 4న ఛత్రశాల స్టేడియంలో 23 ఏళ్ల రెజ్లర్‌ సాగర్‌ హత్యకేసులో సుశీల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అతడి ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసు కూడా జారీ చేశారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.