వాటర్ ట్యాంకులో లభ్యమైన డెడ్‌బాడీ.. వీడిన సస్పెన్స్..

ABN , First Publish Date - 2021-12-08T17:46:24+05:30 IST

ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో లభ్యమైన డెడ్ బాడీ ఎవరిది అన్నదానిపై సస్పెన్స్ వీడింది. మృతుడు అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న కిషోర్‌గా గుర్తించారు.

వాటర్ ట్యాంకులో లభ్యమైన డెడ్‌బాడీ.. వీడిన సస్పెన్స్..

హైదరాబాద్: ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో లభ్యమైన డెడ్ బాడీ ఎవరిది అన్నదానిపై సస్పెన్స్ వీడింది. మృతుడు అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న కిషోర్‌గా గుర్తించారు. ట్యాంకుపైన ఉన్న చెప్పుల ఆధారంగా కిషోర్ అక్క మృతుడిని గుర్తించారు. కిషోర్ స్థానికంగా పెయింటింగ్ వర్క్స్ చేస్తుండేవాడు. కాగా.. అతను మద్యానికి బానిసైనట్టు తెలుస్తోంది. చనిపోవడానికి ముందు రెండు మూడు రోజుల పాటు కిషోర్ వాటర్ ట్యాంకు పరిసర ప్రాంతాల్లో తిరిగినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితం నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. 


ఈ మిస్సింగ్ కేసు ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. కాగా.. ఈ వాటర్ ట్యాంకు నుంచి శివస్థాన్‌పూర్, ఎస్ఆర్కే నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతోంది. రిసాలగడ్డ వాటర్ ట్యాంక్‌కు సైతం ఇక్కడి నుంచే నీరు సరఫరా అవుతోంది. దీంతో ఆయా ఏరియాల్లో ఈ నీళ్లు తాగిన వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 1980లో ఎస్ఆర్‌కే కాలనీలో 600 గజాల స్థలంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. ట్యాంక్ మెయింటెనెన్స్ సక్రమంగా లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మద్యం, గంజాయి సేవించడం, వ్యభిచారం జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-08T17:46:24+05:30 IST