Karnataka Hijab Row: హిజాబ్ లేకుండానే క్లాసులకు ముస్లిం విద్యార్థినులు

ABN , First Publish Date - 2022-06-11T01:39:33+05:30 IST

హిజాబ్(Hijab) ధరించి తరగతులకు హాజరయ్యేలా అనుమతించాలంటూ ముస్లిం విద్యార్థినులు డిమాండ్ చేస్తుండడంతో మల్లగుల్లాలుపడ్డ కర్ణాటక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు కాస్తంత ఉపశమనం దక్కింది.

Karnataka Hijab Row: హిజాబ్ లేకుండానే క్లాసులకు ముస్లిం విద్యార్థినులు

బెంగళూరు : హిజాబ్(Hijab) ధరించి తరగతులకు హాజరయ్యేలా అనుమతించాలంటూ ముస్లిం విద్యార్థినులు డిమాండ్ చేస్తుండడంతో మల్లగుల్లాలుపడ్డ కర్ణాటక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు కాస్తంత ఉపశమనం దక్కింది. ఇదే అంశంపై సస్పెన్షన్‌కు గురయిన పలువురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండానే క్లాసులకు హాజరవ్వడం మొదలుపెట్టారు. దీంతో అక్కడి ప్రభుత్వవర్గాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని  వ్యాఖ్యనిస్తున్నాయి. ఇతర విద్యార్థినులు కూడా వీరి మార్గంలో పయనించేందుకు ఈ పరిణామం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


కాగా దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడీలోని గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్‌ కాలేజీకి చెందిన ఏడుగురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి క్లాసులకు వస్తామంటూ పట్టుబట్టారు. హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో.. విధిలేని పరిస్థితుల్లో ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. వారంతా ఇప్పుడు హిజాబ్ లేకుండానే క్లాసులకు వస్తున్నారని కాలేజీ ప్రిన్సిపల్ శేఖర్ నిర్ధారించారు. సస్పెన్షన్ కాలం పూర్తవ్వడంతో విద్యార్థినులు తరగతులకు వస్తున్నారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ విషయం గురించి చర్చించామని ఆయన వివరించారు. హిజాబ్ ధరిస్తామంటూ మొత్తం 101 మంది విద్యార్థినులు డిమాండ్ చేయగా అందులో 45 మంది ప్రస్తుతం క్లాసులకు వస్తున్నారని ప్రిన్సిపల్ శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా చక్కటి పరిణామమని, మిగతా విద్యార్థులకు కూడా సందేశం వెళ్తుందని ఆశిస్తున్నట్టు కర్ణాటక విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-06-11T01:39:33+05:30 IST