కోహెడ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2020-12-02T05:25:54+05:30 IST

కోహెడ తహసీల్దార్‌పై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. కోహెడ తహసీల్దార్‌ జానకి ప్రస్తుతం నారాయణరావు పేట మండల తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.

కోహెడ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు

సిద్దిపేట సిటీ/కోహెడ, డిసెంబరు 1: కోహెడ తహసీల్దార్‌పై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. కోహెడ తహసీల్దార్‌ జానకి ప్రస్తుతం నారాయణరావు పేట మండల తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణరావుపేటలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సెప్టెంబరు 17 నుంచి నవంబరు 30 వరకు ఆమె విధులకు గైర్హాజరయ్యారు. దీంతో సిద్దిపేట రెవెన్యూ డివిజనల్‌ అధికారి కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. కొన్ని రోజులుగా విధులకు హాజరు కానందున జానకిని సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లా హెడ్‌ క్వార్టర్‌ను వదిలి వెళ్లొద్దని కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-12-02T05:25:54+05:30 IST