డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

ABN , First Publish Date - 2021-06-13T08:35:21+05:30 IST

దివాన్‌ హౌసింగ్‌ ఫైనా న్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేర్ల ట్రేడింగ్‌ను సోమవారం (ఈ నెల 14) నుంచి నిలిపివేస్తున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఎన్‌ఎ స్‌ఈ, బీఎస్‌ఈ ప్రకటించాయి. ఎందుకంటే, దివాలా పరిష్కార ప్రక్రియలో

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

రేపటి నుంచే అమల్లోకి: స్టాక్‌ ఎక్స్ఛేంజీలు


ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనా న్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేర్ల ట్రేడింగ్‌ను సోమవారం (ఈ నెల 14) నుంచి నిలిపివేస్తున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఎన్‌ఎ స్‌ఈ, బీఎస్‌ఈ ప్రకటించాయి. ఎందుకంటే, దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా డీహెచ్‌ఎ్‌ఫఎల్‌.. పిరామల్‌ గ్రూప్‌ పరమైంది. కంపెనీ దివాలా పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ముంబై బెంచ్‌ ఆమోదం కూడా తెలిపింది. పిరామల్‌ గ్రూప్‌ సమర్పించిన దివాలా పరిష్కార ప్రణాళికలో డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ షేర్లకు ఎలాంటి విలువ లెక్కగట్టలేదు. పిరమాల్‌ బిడ్‌ను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించడంతో కంపెనీ షేర్లు విలువ కోల్పోవడంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

Updated Date - 2021-06-13T08:35:21+05:30 IST