Advertisement

ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

Jun 30 2020 @ 05:33AM

 నెల్లూరు (జడ్పీ), జూన్‌ 29: జిల్లాలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేసినట్లు డీపీవో ధనలక్ష్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోట మండలం చెందోడు గ్రామ పంచాయతీ కార్యదర్శి అల్లాభక్షు, ఆత్మకూరు మండలం వాసిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి దయాకర్‌ను సస్పెండ్‌ చేశామని తెలిపారు.


చెందోడులో సాధారణ నిధులు రూ.2.32లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2.26లక్షలు దుర్వినియోగం చేసినట్లు తేలడంతోపాటు వలంటీర్ల వద్ద నగదు వసూలు చేయడం, గ్రామంలో తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు వాస్తవమని తేలడంతో ఆయనను సస్పెండ్‌ చేశామని తెలిపారు. అలాగే వాసిలి గ్రామ కార్యదర్శి దయాకర్‌ కోవిడ్‌ -19 విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాగునీటి సరఫరాను పట్టించుకోకపోవడం, పింఛన్ల పంపిణీ సక్రమంగా చేయకపోవడం, శిక్షణ కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో  సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.