పొన్నకల్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-26T04:28:54+05:30 IST

అడ్డాకుల మండల పరిధిలోని పొన్నకల్‌లో గురువారం శ్రీనివాస్‌(45) అనే ఆటో డ్రైవర్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు.

పొన్నకల్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి


అడ్డాకుల, ఫిబ్రవరి 25: అడ్డాకుల మండల పరిధిలోని పొన్నకల్‌లో గురువారం శ్రీనివాస్‌(45) అనే ఆటో డ్రైవర్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. చెరువుకట్ట మీద నుంచి కొంచెం దూరంలో పడిపోయిన ఆటోలో గాయాలతో ఓ వ్యక్తి మృతి చెందాడని గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీనివాస్‌ భార్య రెండు నెలల క్రితమే హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో వారి ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్‌పై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-02-26T04:28:54+05:30 IST