నిలకడగా సాగర్‌ జలాశయ నీటిమట్టం

ABN , First Publish Date - 2022-07-07T05:55:19+05:30 IST

నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది.

నిలకడగా సాగర్‌ జలాశయ నీటిమట్టం
నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టు

హాలియా, జూలై 6: నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312. 0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 531.10అడుగులు(170.3012టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాలువ ద్వారా 5,394 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ, వరద కాల్వ, ఎస్‌ఎల్‌బీసీ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాలకు ఎటువంటి నీటి విడుదల లేదు. ఇదిలా ఉండగా గత ఏడాది ఇదే రోజున ఎగువ నుంచి 15,175 క్యూసెక్కుల వరద శ్రీశైలం నుంచి సాగర్‌కు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటిమట్టం 532.40అడుగులు(172.8700టీఎంసీలు)గా ఉంది. గతేడాది ఇదేరోజున 2.5688 టీఎంసీల నీరు సాగర్‌లో అధికంగా ఉంది.  

Updated Date - 2022-07-07T05:55:19+05:30 IST