Goa River Bridge Accident: నదిలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు గల్లంతు

ABN , First Publish Date - 2022-07-28T17:44:06+05:30 IST

వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలో(Goa) గురువారం జరిగింది....

Goa River Bridge Accident: నదిలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు గల్లంతు

పనాజీ(గోవా): వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలో(Goa) గురువారం జరిగింది. దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై(Zuari River Bridge) నుంచి వస్తున్న కారు(car) ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. నదిలో పడిన కారును ఓ మహిళ నడుపుతోందని, కారులో నలుగురున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఇండియన్ కోస్ట్ గార్డ్స్, నేవీ, అగ్నిమాపకశాఖ, ఎమర్జెన్సీ సర్వీసుల శాఖ, గోవా పోలీసులు(Indian Coast Guard, Navy, fire and emergency services and Goa police personnel) కలిసి నదిలో పడిన వాహనంతోపాటు అందులో ఉన్న వారిని వెలికి తీసేందుకు గాలింపు చేపట్టారు.


గోవా రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని కొర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారి వంతెనపై కారును దాటబోయి నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కారు నదిలో పడిందని పోలీసులు పేర్కొన్నారు.నదిలో పడిన వారి కోసం ఇండియన్ నేవీ డైవర్స్(Indian Navy divers) కూడా గాలిస్తున్నారు.


Updated Date - 2022-07-28T17:44:06+05:30 IST