బైకర్‌‌ని ఢీకొట్టి పారిపోయిన ఎస్‌యూవీ డ్రైవర్..

Published: Mon, 06 Jun 2022 15:54:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బైకర్‌‌ని ఢీకొట్టి పారిపోయిన ఎస్‌యూవీ డ్రైవర్..

న్యూఢిల్లీ : ఓ బైకర్, ఎస్‌యూవీ కారు డ్రైవర్‌ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ప్రమాదానికి దారితీసింది. బైకర్‌ని వెనుక నుంచి ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు. న్యూఢిల్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రోడ్డుపై వెళ్తున్న బైకర్ల సమూహంపై స్కార్పియో డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైకర్లను దుర్భాషలాడాడు. కారుతో తొక్కించి చంపేస్తానంటూ బైకర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌ను వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టాడు. బైక్ కిందపడిపోవడంతో బైకర్ డివైడర్‌ను గుద్దుకున్నాడు. అయితే అదృష్టవశాత్తూ బైకర్‌కి బలమైన గాయాలేమీ కాలేదు. కాగా నిందిత ఎస్‌యూవీ డ్రైవర్ కారు ఆపకుండానే పరారయ్యాడు. ఈ ఘటనను వీడియో తీసిన అనురాగ్ అయ్యర్ అనే బైకర్ ట్విట్టర్ వేదికగా విషయాన్ని వెల్లడించాడు. పీఎంవో ఇండియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీపీన్యూఢిల్లీలను ట్యాగ్ చేశాడు. తమకు సాయం చేయాలని విన్నవించాడు. తాము గురుగ్రామ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వెళ్లడించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాల ప్రాకం కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.