కానరాని స్వచ్ఛ భారత్‌

ABN , First Publish Date - 2021-03-02T06:29:51+05:30 IST

స్వచ్చ భారత్‌, స్వ చ్చాంధ్రప్రదేశ్‌ నినాదాలకే పరిమితమవుతున్నాయి.

కానరాని స్వచ్ఛ భారత్‌
మరుగుదొడ్లు లేని ఎంపీడీవో కార్యాలయం



ప్రభుత్వ కార్యాలయాల్లో 

లేని మరుగుదొడ్లు

పట్టణాల్లో పబ్లిక్‌ టాయిలెట్లూ కరువే

వివిధ పనులపై వచ్చే ప్రజల అవస్థలు 

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన

త్రిపురాంతకం, మార్చి 1 : స్వచ్చ భారత్‌, స్వ చ్చాంధ్రప్రదేశ్‌ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎ త్తున ప్రచారం చేస్తున్నా ఆచరణలో విఫలమవుతున్నాయి. స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ కోసం కో ట్లాది రూపాయలతో ప్రణాళికలు రూపొందిస్తున్నా ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎ క్కడా మరుగుదొడ్లు కనిపించడంలేదు. అధికారులు ఆ దిశగా ప్రయ త్నాలు చేయడం లేదు. నిత్యం మండలంలోని గ్రామాల నుంచి ప్ర జలు అనేక పనులపై కార్యాలయాలకు వస్తుంటారు.  అలా వచ్చిన వారి కోసం తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో కనీస వసతులు కల్పించాల్సి ఉంది.  ఇక్కడ మరుగుదొడ్లు లేక వివిధ పనులపై వ చ్చేవారు ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధిస్తూ ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చినా కార్యాలయాల్లో మాత్రం ఆ నినాదం కాగితాలకే పరిమితమైందని పలువురు విమర్శిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేక అధికారులు, ప్రజలు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం త్రిపురాంతకంలో ని తహసీల్దారు కార్యాలయం, ఎం పీడీవో కార్యాలయం, వెలుగు, ఉ పాధి, హౌసింగ్‌, పశువైద్యశాల, ప్రజా వైద్య శాల, బ్యాంకులు వంటి ఏ ఒక్క కార్యాలయంలోనూ మరుగుదొడ్లు లేవు. కొన్నింటిలో ఆయా కార్యాలయాల అధికారులు వాడుకునేందుకు మాత్రమే ఉన్నాయి. కొన్నింటిలో అవికూడా లేవు. ఇక అనేక పనుల కోసం పట్టణానికి వచ్చే ప్రజలు వాడుకునేందుకు కార్యాలయాలతోపాటు, ఇతర ప్రదేశాల్లోనైనా పబ్లిక్‌ టాయిలెట్లు కూడా లేవు. దీంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం.  అత్యవసర పరిస్థితుల్లో ఖాళీ స్థలాలను, బహిరంగ ప్రదేశాల వ ద్దకు పరుగు తీస్తున్నారు. పాలకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-03-02T06:29:51+05:30 IST