
హైదరాబాద్/కవాడిగూడ: హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షుడిగా స్వామి బోధమయానంద సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రామకృష్ణమఠం పూర్వ అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద స్వామి బోధమయానందకు బాధ్యతలు అప్పగించారు. అనేక సంవత్సరాలుగా స్వామి వివేకానంద హ్యుమన్ ఎక్సలెన్సీ డైరెక్టర్‌గా బోధమయానంద విధులు నిర్వహించారు. మూడు నెలల క్రితం స్వామి బోధమయానంద వైజాగ్‌లోని రామకృష్ణ మిషన్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం రామకృష్ణమఠం అధ్యక్షుడిగా పనిచేస్తున్న స్వామి జ్ఞానదానంద వైజాగ్ రామకృష్ణ మిషన్‌కు బదిలీ కాగా హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షుడిగా బోధమయానంద బదిలీ అయి వచ్చారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం స్వామీజీలు పాల్గొన్నారు.