స్వర రాగ గంగా ప్రవాహం నటరాజన్‌ క్లారినెట్‌ కచేరి

ABN , First Publish Date - 2021-03-01T07:38:54+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత క్లారినెట్‌ సంగీత విద్వాంసుడు, సెంట్రల్‌ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఏకేసీ నటరాజన్‌ క్లారినెట్‌ కచేరి స్వర రాగ గంగా ప్రవాహంలా సాగింది.

స్వర రాగ గంగా ప్రవాహం నటరాజన్‌ క్లారినెట్‌ కచేరి
కచేరి నిర్వహిస్తున్న నటరాజన్‌

తిరుపతి(కల్చరల్‌), ఫిబ్రవరి 28: ప్రపంచ ప్రఖ్యాత క్లారినెట్‌ సంగీత విద్వాంసుడు, సెంట్రల్‌ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఏకేసీ నటరాజన్‌ క్లారినెట్‌ కచేరి స్వర రాగ గంగా ప్రవాహంలా సాగింది. ఆదివారం సాయంత్రం రేణిగుంటరోడ్డులోని సాయి నిర్మల కల్యాణ మండపంలో జరిగిన ఎస్వీ నాదస్వర పాఠశాల అధ్యాపకుడు సత్యనారాయణ పదవీ విరమణ సభలో ఏర్పాటు చేసిన నటరాజన్‌ కచేరి శ్రోతలను పరవశుల్ని చేసింది. వీరికి బెంగళూరుకు చెందిన నాదస్వర విద్వాంసుడు బీఎస్‌ రమేష్‌ విళియంబొక్కం, విద్వాన్‌ కందకూరుకు చెందిన కె.మనోహర్‌లతోపాటు ప్రత్యేకంగా కళైమామణి ఎమ్మార్‌ వాసుదేవన్‌ల డోలు వాయిద్య సహకారం అద్భుతంగా సాగింది. అనంతరం నటరాజన్‌ బృందాన్ని నిర్వాహకులు సత్కరించారు.

Updated Date - 2021-03-01T07:38:54+05:30 IST