ఆధ్యాత్మిక స్వర్గధామం.. యాదాద్రి: స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2022-04-12T20:44:31+05:30 IST

అత్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట, శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని

ఆధ్యాత్మిక స్వర్గధామం.. యాదాద్రి: స్వరూపానందేంద్ర

యాదాద్రి:  అత్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట, శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామీ  దర్శించుకున్నారు.గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలింశారు.  ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ..  ‘‘యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది.కరోనా కారణంగా విశాఖ, ఋషికేశ్‌లోనే గడపడం జరిగింది.దేశంలో ఎంతో మంది హిందువులం అంటారు.. కానీ ఎవరూ చేయని నిర్మాణం సీఎం కేసీఆర్ చేశారు.ఇది ఒక అద్భుతం, ప్రజలకు  భక్తులకు ఆధ్యాత్మిక స్వర్గధామం. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలి, హిందూ దేవాలయాలు ఎవరి సొత్తు కాదు, ప్రజలందరివీ. యుగయుగాలుగా శైవులు, వైష్ణవులు వైషమ్యాలతో  కొట్టుకున్నారు. ఆది శంకరాచార్యుల వారు అందరినీ సమానంగా చూశారు, అందరు దేవతల నిలయం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట టీటీడీ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని స్వరూపానందేంద్ర తెలిపారు.

Updated Date - 2022-04-12T20:44:31+05:30 IST