ఆర్థిక ఇబ్బందుల్లో యువ టీటీ ప్లేయర్‌

ABN , First Publish Date - 2020-08-09T09:09:36+05:30 IST

టేబుల్‌ టెన్నిస్‌ వర్థమాన క్రీడాకారిణి స్వస్తికా ఘోష్‌ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. జూనియర్‌ టీటీలో ప్రపంచ ఐదో ర్యాంకరైన స్వస్తికకు కోచ్‌ ఆమె

ఆర్థిక ఇబ్బందుల్లో యువ టీటీ ప్లేయర్‌

ముంబై: టేబుల్‌ టెన్నిస్‌ వర్థమాన క్రీడాకారిణి స్వస్తికా ఘోష్‌ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. జూనియర్‌ టీటీలో ప్రపంచ ఐదో ర్యాంకరైన స్వస్తికకు కోచ్‌ ఆమె తండ్రి సందీపే. టీటీ లెవల్‌-2 కోచ్‌ అయిన సందీప్‌.. కుమార్తెకు వ్యక్తిగత శిక్షణ ఇస్తూ ఓ పాఠశాలలో శిక్షకుడిగా పనిచేసేవాడు. లాక్‌డౌన్‌తో పాఠశాల మూతపడడంతో సందీప్‌ ఉపాధి కోల్పోయాడు. దీంతో స్వస్తిక సాధన కుంటుపడింది. ఉద్యోగం ఉన్నంతకాలం ఎలాంటి లోటు లేకుండా ఆమెకు శిక్షణ ఇచ్చానని.. ఇప్పుడు తనవల్ల కావడం లేదని సందీప్‌ వాపోతున్నాడు. ‘వచ్చే నవంబరు 29 నుంచి ప్రపంచ జూనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీలో పతకం సాధించాలంటే కఠోర సాధన అవసరం. ఆమె రోజు వారి డైట్‌కు రూ.1200 వ్యయమవుతుంది. ప్రస్తుతం నాకు ఉపాధి లేకపోవడంతో ఆమెకు సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నా. ఈ విషయమై కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర క్రీడాశాఖకు లేఖలు రాశా. కానీ, వారి నుంచి స్పందన లేదు. నేను పనిచేసే పాఠశాల తెరిస్తే గానీ నాకు ఉపాధి లభించదు. అప్పటిదాకా నా కుమార్తె శిక్షణకు ప్రభుత్వం సాయపడాలి’ అని సందీప్‌ కోరుతున్నాడు. కాగా.. స్వస్తిక జూనియర్‌ స్థాయిలో 8 అంతర్జాతీయ పతకాలు సాధించింది.

Updated Date - 2020-08-09T09:09:36+05:30 IST