Inspirational Story: చీపురుపట్టి ఊడ్చిన అదే బ్యాంకులో ఇప్పుడు ఆమె అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌!

ABN , First Publish Date - 2022-08-04T18:24:45+05:30 IST

కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఆమె చదువును మధ్యలోనే ఆపేలా చేశాయి. ఆ తర్వాత అవే సమస్యలు చిన్న తనంలోనే ఆమెను పెళ్లి పీటలెక్కించాయి. వివాహం తర్వాతైన తన తల రాత మారుతుందని..

Inspirational Story: చీపురుపట్టి ఊడ్చిన అదే బ్యాంకులో ఇప్పుడు ఆమె అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఆమె చదువును మధ్యలోనే ఆపేలా చేశాయి. ఆ తర్వాత అవే సమస్యలు చిన్న తనంలోనే ఆమెను పెళ్లి పీటలెక్కించాయి. వివాహం తర్వాతైన తన తల రాత మారుతుందని.. ఆశించిన ఆమెకు అక్కడా నిరాశే మిగిలింది. కష్టసుఖాల్లో జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త.. విధి వక్రీకరించడంతో ఆమెను ఒంటరిని చేశాడు. ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆమె.. పిల్లలను పోషించుకునేందుకు బ్యాంకులో స్వీపర్‌(Sweeper in bank) గా చేరింది. కష్టపడి శ్రమించి.. ఇప్పుడు అదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌(assistant genral manager of sbi)గా విధులు నిర్వహిస్తోంది. ప్రతీక్ష విజయ గాథ( Pratiksha Success Story) పై ఓ లుక్కేస్తే..


ప్రతీక్ష.. పుణేలోని పేద దంపతులకు 1964లో జన్మించారు. కుటుంబ ఆర్థిక కారణాల వల్ల కనీసం 10వ తరగతి చదవకుండానే.. చదువును మధ్యలో ఆపేశారు. అనంతరం 16ఏళ్లకే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె భర్త ముంబైలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బుక్ బైండర్‌గా ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల.. ఆమె పూణేను వీడారు. భర్తతో కలిసి ముంబై(Mumbai)లో అడుగుపెట్టారు. భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తూ.. మగ పిల్లాడికి జన్మనిచ్చారు. జీవితంలో అలా సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యాక్సిడెంట్‌లో భర్త కన్నుమూశాడు. దీంతో 20ఏళ్ల వయసులోనే ఆమె ఒంటరైపోయారు. పిల్లలను పోషించాల్సిన బాధ్యతను తనపై వేసుకుని.. భర్త పని చేసే బ్యాంకు వద్దకు వెళ్లి, తన పరిస్థితి వివరించి ఏదైనా పని ఇవ్వమని కోరారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన అధికారులు.. ఆమెకు బ్యాంకులో స్వీపర్‌గా పని చేసే అవకాశం  కల్పించారు. 



స్వీపర్‌గా పని చేస్తూ.. అక్కడ అధికారులను గమనించిన ఆమె.. కీలక నిర్ణయం తీసుకున్నారు. జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే కష్టమైనా సరే.. మధ్యలోనే వదిలేసిన చదువును తిరిగి కొనసాగించారు. 60శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. అదే పట్టుదలతో రాత్రి వేళ పని చేసే కళాశాలలో చేరి 12వ తరగతి కూడా పూర్తి చేశారు. అనంతరం పరీక్షలు రాసి బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం సాధించారు. ఈ క్రమంలోనే బ్యాంకులో మెసేంజర్‌గా పని చేస్తూ తనకు ఎంతో మద్దుతుగా నిలిచిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 2004 ట్రైనీ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందిన ప్రతీక్ష.. ఒకప్పుడు స్వీపర్‌గా పని చేసిన బ్యాంకులోనే ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్‌గా నియామకం అయ్యారు. 




Updated Date - 2022-08-04T18:24:45+05:30 IST