స్వీట్‌ పొటాటో పఫ్స్‌

ABN , First Publish Date - 2021-03-06T18:12:49+05:30 IST

చిలగడదుంపలు - పావు కేజీ, పాస్ట్రీ షీట్స్‌ - రెండు, మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు,

స్వీట్‌ పొటాటో పఫ్స్‌

కావలసినవి: చిలగడదుంపలు - పావు కేజీ, పాస్ట్రీ షీట్స్‌ - రెండు, మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, 


తయారీ విధానం: చిలగడదుంపలను ఉడికించి, గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో వెజిటబుల్స్‌ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగనివ్వాలి. టొమాటో ముక్కలు వేసి కలపాలి.గరంమసాల, ధనియాల పొడి, పసుపు వేసి కలియబెట్టుకుని కాసేపయ్యాక దింపుకోవాలి. చల్లారిన తరువాత మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్‌  వేయాలి. తరువాత చిలగడదుంపల గుజ్జు, ఉల్లిపాయల టొమాటో పేస్టు వేసి కలియబెట్టాలి. చిక్కటి మిశ్రమంలా తయారయ్యే వరకు వేగించాలి. చివరగా కొత్తిమీర వేసి దింపాలి. పాస్ట్రీ షీట్స్‌ను కావాల్సిన సైజులో కత్తిరించాలి. ఒక్కో షీట్‌లో సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పెట్టి అన్ని వైపులా మడవాలి. ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి ప్రీ హీట్‌ చేయాలి. పఫ్స్‌ను ఓవెన్‌లో పెట్టి బేక్‌ చేయాలి. వేడి వేడిగా తింటే స్వీట్‌ పొటాటో పఫ్స్‌ ఎంతో రుచిగా ఉంటాయి.


Updated Date - 2021-03-06T18:12:49+05:30 IST