స్వీట్ పొటాటో విత్ క్వినోవా
ABN , First Publish Date - 2021-03-06T18:02:52+05:30 IST
చిలగడదుంపలు - రెండు, కొబ్బరి తురుము - ఒకకప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్వినోవా - ఒకకప్పు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్, జీడిపప్పు - అర కప్పు, మిరియాల పొడి - ఒక టీస్పూన్, బిర్యానీ ఆకు - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
కావలసినవి: చిలగడదుంపలు - రెండు, కొబ్బరి తురుము - ఒకకప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్వినోవా - ఒకకప్పు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్, జీడిపప్పు - అర కప్పు, మిరియాల పొడి - ఒక టీస్పూన్, బిర్యానీ ఆకు - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: చిలగడదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి వేగించి పెట్టుకోవాలి. క్వినోవాను ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు వేయాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేగించాలి. మిరియాల పొడి, వేగించిన చిలగడదుంపలు, కొబ్బరి తురుము వేసి కలపాలి. బాగా వేగిన తరువాత ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి మరికాసేపు వేగించాలి. మరో ఐదు నిమిషాలు వేగిన తరువాత క్వినోవా వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై మరికాసేపు వేగించాలి. వేడి వేడిగా వడ్డించాలి.