బెల్లం అన్నం

ABN , First Publish Date - 2020-07-18T17:26:52+05:30 IST

బియ్యం - అరకేజీ, పెసరపప్పు - అరకప్పు, నెయ్యి - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, జీడిపప్పు - ఐదారు పలుకులు, కిస్మిస్‌ - ఐదారు, బెల్లం - పావుకేజీ, పాలు - అర లీటరు.

బెల్లం అన్నం

కావలసినవి: బియ్యం - అరకేజీ, పెసరపప్పు - అరకప్పు, నెయ్యి - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, జీడిపప్పు - ఐదారు పలుకులు, కిస్మిస్‌ - ఐదారు, బెల్లం - పావుకేజీ, పాలు - అర లీటరు.


తయారీ: ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పును కొద్దిగా ఉడికించి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై ఒక పాత్రపెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. నీళ్లు వేడి అయ్యాక ఉడికించిన పెసరపప్పు వేయాలి. నీళ్లు, పెసరపప్పు మిశ్రమం మరుగుతున్న సమయంలో అన్నం వేసి కలపాలి. కాసేపయ్యాక బెల్లం వేయాలి. జీడిపప్పు, కిస్‌మి్‌సలు వేసి కలియబెట్టాలి. ఒక టీస్పూన్‌ నెయ్యి వేయాలి. చివరగా పాలు పోసి కలపాలి. ఐదారు నిమిషాలు ఉడికించిన తరువాత దింపాలి.

అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం అన్నం రెడీ.

Updated Date - 2020-07-18T17:26:52+05:30 IST