స్వీట్లతో పెరిగే శరీర భారాన్ని తగ్గించుకోవాలంటే..?

ABN , First Publish Date - 2022-02-15T19:20:18+05:30 IST

తరచుగా స్వీట్స్‌ మీదకు మనసు మళ్లటానికి కొన్ని కారణాలుంటాయి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకోగలిగితే స్వీట్లతో పెరిగే అదనపు శరీర భారాన్ని అదుపు చేసుకోవచ్చు.

స్వీట్లతో పెరిగే శరీర భారాన్ని తగ్గించుకోవాలంటే..?

ఆంధ్రజ్యోతి(15-02-2022)

తరచుగా స్వీట్స్‌ మీదకు మనసు మళ్లటానికి కొన్ని కారణాలుంటాయి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకోగలిగితే స్వీట్లతో పెరిగే అదనపు శరీర భారాన్ని అదుపు చేసుకోవచ్చు.


ఒత్తిడి, అలసట, నిద్రలేమి...

తీపి తినాలనిపించటానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించటం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది. ఇలా అనిపించిన వెంటనే తీపి పదార్థాల కోసం వెతుక్కోకండి. ఒకసారి తీపి తినటం మొదలుపెడితే అది అలాగే కొనసాగుతుంది. కాబట్టి స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాల్ని సరిదిద్దటం మీద మనసు పెట్టండి.  


స్వీట్ల మీద ఇష్టం పెరగటానికి వ్యాయామం కొరవడడం మరో కారణం. శరీరం యాక్టివ్‌గా లేనప్పుడు బద్ధకం ఆవరిస్తుంది. దాంతో మనసు కప్‌ కేక్స్‌, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. కాబట్టి ఏదో ఒక ఫిజికల్‌ యాక్టివిటీ ఉండటం తప్పనిసరి. సుగర్‌ క్రేవింగ్‌కు డీహైడ్రేషన్‌ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది. కాబట్టి తీపి తినాలనిపించినప్పుడు నీళ్లు తాగాలి.


తీపి చిట్కాలు: తీపి తినాలనే కోరికను కంట్రోల్‌ చేసుకోలేకపోతే ఈ చిట్కాలు పాటించండి. చాక్లెట్లు తినాలనిపిస్తే 70శాతం డార్క్‌ చాక్లెట్‌ రెండు ముక్కలు మాత్రమే తినండి. చిలగడ దుంపలు, స్వీట్‌ కార్న్‌, ఖర్జూరాలు బెస్ట్‌ ఆప్షన్‌. 2 ఖర్జూరాలు, 2 అప్రికాట్స్‌, 4 ఎండు ద్రాక్ష, 2 అంజీర్‌... వీటిలో ఏదో ఒకటి తినొచ్చు. 

Updated Date - 2022-02-15T19:20:18+05:30 IST