Friendship: స్నేహమంటే ఇదేరా.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన డెలివరీ బాయ్స్ వీడియో..!

ABN , First Publish Date - 2022-07-18T03:29:24+05:30 IST

ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోల గురించి తెలియని వారుండరు. మెట్రో నగరాల్లో, ఓ మోస్తరు పట్టణాలకు కూడా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్..

Friendship: స్నేహమంటే ఇదేరా.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన డెలివరీ బాయ్స్ వీడియో..!

ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోల గురించి తెలియని వారుండరు. మెట్రో నగరాల్లో, ఓ మోస్తరు పట్టణాలకు కూడా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ తమ కార్యకలాపాలను విస్తరించాయి. ప్రత్యక్షంగా ఎంతోమంది ఉపాధి కల్పనకు కారణమయిన ఈ స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసే డెలివరీ బాయ్స్‌లో కొందరి నేపథ్యం ‘అయ్యో పాపం’ అని వారిపై సానుభూతి కలిగేలా చేస్తుంది. వారి ఆత్మస్థైర్యం చూస్తే ముచ్చటేస్తుంది. అలాంటి కష్టజీవులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. స్విగ్గీ, జొమాటో కంపెనీల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ అందులో పనిచేసే డెలివరీ బాయ్స్ ఆకలి ఒక్కటే.. కష్టం ఒక్కటే అని రుజువు చేసే ఘటన ఇది. Sannah Arora అనే మహిళ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయి నెటిజన్ల నుంచి మంచి స్పందన పొందింది.



“True friendship seen on these extremely hot and unbearable days in Delhi!”  అని ఆ మహిళ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఇంతకీ ఏముందంటే.. స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్‌పై వెళుతున్నాడు. జొమాటో డెలివరీ బాయ్ సైకిల్‌పై వెళుతూ అతని కంట పడ్డాడు. ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ స్నేహపూర్వకంగా ఆ జొమాటో డెలివరీ బాయ్‌కు చేయందించాడు. దీంతో.. బైక్‌తో పాటే ఆ సైకిల్‌పై వెళుతున్న జొమాటో డెలివరీ బాయ్ కూడా ఫుడ్‌ను సకాలంలో డెలివరీ చేయగలిగాడు. వాళ్లిద్దరూ కలిసి వెళుతున్న దృశ్యాన్ని వారి వెనుక కారులో వెళుతున్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజమైన స్నేహమంటే ఇదేనని ఆ వీడియోని చూసిన నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-07-18T03:29:24+05:30 IST