100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో కైలీ ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2021-06-14T09:51:59+05:30 IST

ఆస్ట్రేలియా టీనేజ్‌ స్విమ్మర్‌ కైలీ మెక్‌కియోన్‌ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో కైలీ ప్రపంచ రికార్డు

అడిలైడ్‌: ఆస్ట్రేలియా టీనేజ్‌ స్విమ్మర్‌ కైలీ మెక్‌కియోన్‌ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఒలింపిక్‌ ట్రయల్స్‌లో 19ఏళ్ల కైలీ 57.45 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసింది. ఈ క్రమంలో 2019లో అమెరికా స్విమ్మర్‌ రేగన్‌ స్మిత్‌ నెలకొల్పిన 57.57 సెకన్ల వరల్డ్‌ రికార్డును బద్దలుకొట్టింది. గత ఆగస్టులో మెక్‌కియోన్‌ తండ్రి బ్రెయిన్‌ కేన్సర్‌తో మరణించాడు. అయితే, తనలోని బాధను ప్రేరణగా మలచుకొని సాధన చేసినట్టు కైలీ తెలిపింది. 

Updated Date - 2021-06-14T09:51:59+05:30 IST