జాతీయ స్విమ్మింగ్‌లో శ్రీకాంత్‌ సత్తా

ABN , First Publish Date - 2021-11-29T05:32:27+05:30 IST

జాతీయ స్విమ్మింగ్‌లో శ్రీకాంత్‌ సత్తా

జాతీయ స్విమ్మింగ్‌లో శ్రీకాంత్‌ సత్తా

భవానీపురం, నవంబరు 28 : మంగుళూరులో మూడు రోజులుగా జరుగుతున్న 17వ మాస్టర్స్‌ నేషనల్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన స్విమ్మర్‌ జి.శ్రీకాంత్‌ ఆదివారం పలు విభాగాల్లో సత్తాచాటి పతకాలు సాధించాడు. పురుషుల 26-29 ఏజ్‌ గ్రూపులో శ్రీకాంత్‌ 400 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో స్వర్ణం, 100 మీటర్ల బటర్‌ ఫ్లైలో రజతం పొందాడు. 200 మీటర్ల మెడ్లే విభాగంలోనూ స్వర్ణం సాధించాడు. 

Updated Date - 2021-11-29T05:32:27+05:30 IST