TS News: ప్రాణాలు తీసేస్తున్న స్విమ్మింగ్ పూల్స్

Published: Sun, 31 Jul 2022 16:46:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్: స్విమ్మింగ్‌ పూల్ (Swimming Pool) మరో బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. నిన్న సాయంత్రం నార్సింగిలోని కోకాపేట్‌లో ఈ ఘటన జరిగింది. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి 9వ తరగతి విద్యార్థి లంక శ్యామ్ (Lanka Syam) మృతి చెందాడు. శ్యామ్ కుటుంబం రెండ్రోజుల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కాగా స్విమింగ్ పూల్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే లంక శ్యామ్ చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


ఇటీవల హైదరాబాద్ నాగోల్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లింగంపల్లికి చెందిన విశ్వనాధ్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు మనోజ్ (10) (Manoj) వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఇంటికి దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో.. సరదాగా ఈత కొట్టాలనుకుని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌ (Blue Fab Swimming pool)కి వెళ్లాడు. అయితే, స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడు. మనోజ్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాలుడి మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ ఓనర్ అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.