క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటుకల్పించేందుకు టీ20 చాలు: ఇయాన్ ఛాపెల్

ABN , First Publish Date - 2021-08-02T03:09:18+05:30 IST

క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో స్థానం కల్పించేందుకు టీ20 ఫార్మాట్ చాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ తాజాగా అభిప్రాయపడ్డారు.

క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటుకల్పించేందుకు టీ20 చాలు: ఇయాన్ ఛాపెల్

మెల్‌బోర్న్: క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో స్థానం కల్పించేందుకు టీ20 ఫార్మాట్ చాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ తాజాగా అభిప్రాయపడ్డారు. ది హండ్రెడ్ పేరిట వచ్చిన కొత్త ఫార్మాట్ అవసరం లేదని పేర్కొన్నారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఈ ఫార్మాట్‌ను రూపొందించింది. ఒక్కో ఇన్నింగ్స్‌ను వంద బంతులకు తగ్గించడం ద్వారా ‘ది హండ్రెడ్’ రూపుదిద్దుకుంది. ఇలా అయితే క్రికెట్ మరింత మందికి చేరువవుతుందనేది దీని వెనుకున్న ఆలోచన. టీ20 ఫార్మాట్‌ను వంద బంతులకు కుదించడం ద్వారా ఈ కొత్త ఫార్మాట్ ఉనికిలోకి వచ్చింది. అయితే..క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో స్థానం కల్పించేందుకు టీ20 ఫార్మాట్ చాలని, బంతుల సంఖ్య మళ్లీ కుదించాల్సిన అవసరం లేదని ఛాపెల్ తాజాగా అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2021-08-02T03:09:18+05:30 IST