అబుదాభి: ఇంగ్లండ్ జట్టుతో ఇక్కడి షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 18వ ఓవర్లో జేమ్స్ నీషమ్ (27) వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో రషీద్ వేసిన చివరి బంతిని ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి నీషమ్ వెనుదిరిగాడు. 18వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగా... ఓపెనర్ మిషెల్ అర్థ శతకం సాధించి వీరవిహారం చేస్తున్నాడు.