యథావిధిగానే...

ABN , First Publish Date - 2020-08-08T09:13:42+05:30 IST

రాబోయే రెండేళ్లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌ల ఆతిథ్యం విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగింది. షెడ్యూల్‌ ప్రకారం 2021లో జరగాల్సిన ఈ మెగా ...

యథావిధిగానే...

వచ్చే ఏడాది భారత్‌లోనే టీ20 వరల్డ్‌కప్‌ 

ఆస్ట్రేలియాలో 2022 టోర్నీ 

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ వాయిదా

దుబాయ్‌: రాబోయే రెండేళ్లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌ల ఆతిథ్యం విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగింది. షెడ్యూల్‌ ప్రకారం 2021లో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భారత్‌లోనే జరగనుంది. ఇక ఈ ఏడాది జరగాల్సిన ఈవెంట్‌ ను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహించబోతున్నా రు. అలాగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను  ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లోనే నిర్వహిస్తారు. శుక్రవారం జరిగిన ఐసీసీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు చెందిన అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. అయితే న్యూజిలాండ్‌లో జరగాల్సిన 2021 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ మాత్రం కరోనా కారణంగా 2022 ఫిబ్రవరి-మార్చికి వాయిదా పడింది. అక్కడ కరోనా కేసులు స్వల్పంగా ఉండడంతో ఈ టోర్నీ జరుగుతుందనే అంతా భావించారు. కానీ ఐసీసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ‘అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీల నిర్వహణపై కొన్ని నెలలుగా మేం ఆలోచిస్తున్నాం. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వడమే మా ఉద్దేశం’ అని ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా తెలిపాడు.


అందుకే వెనక్కి  తగ్గలేదు.. 

కరోనా కారణంగా ఈ ఏడాది ఆసీ్‌సలో జరగాల్సిన టీ20 ప్రపంచక్‌పను ఐసీసీ 2022కి గతంలోనే వాయిదా వేసింది. దీంతో ఆ విండోను బీసీసీఐ తమ ఐపీఎల్‌ టోర్నీకి వినియోగించుకుంటోంది. అయితే దీనికి ప్రతిగా వచ్చే ఏడాది భారత్‌లో జరగాల్సిన టోర్నీ ఆతిథ్య హక్కులు తమకే కావాలని సీఏ కోరుకుంది. కానీ భారత్‌ మాత్రం ఎట్టి పరిస్థితిలో దీనికి అంగీకరించకూడదనే భావనలో ఉంది. ఎందుకంటే 2022లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహిస్తే.. ఆ మరుసటి ఏడాదే బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో కలిసి వన్డే వరల్డ్‌క్‌పనకు కూడా భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇలా వరుసగా రెండు మెగా ఐసీసీ టోర్నీలు నిర్వహిస్తే భారమవుతుందన్నది బీసీసీఐ ఆలోచన. 

Updated Date - 2020-08-08T09:13:42+05:30 IST