దర్జీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-03-01T05:37:51+05:30 IST

రాష్ట్రంలో అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడుకోవాలని, దర్జీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనిని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

దర్జీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
ఖానాపూర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న మేరు కులస్థులు

మేరుసంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్‌ దినోత్సవం

ఖానాపూర్‌, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడుకోవాలని, దర్జీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనిని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఆదివారం టైలర్‌ దినోత్సవం సందర్భంగా ఖానాపూర్‌లో మేరుకుల సంఘం ఆద్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల లు వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రెస్‌భవన్‌లో మేరు సంఘం అధ్యక్షుడు గంగనర్సయ్య అధ్యక్షతన ఘనంగా టైలర్‌ దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తోందన్నారు. మేరు కులస్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా స్థానిక ఎమ్మెల్యే రేఖానాయాక్‌ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతుగా కృషి చేస్తామన్నారు. ఇందులో ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు దొనికెని దయానంద్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాఽఽధ్యక్షుడు రాజగంగన్న, మేరు సంఘం అధ్యక్షుడు కర్న గంగనర్సయ్య, ఉపాధ్యక్షులు సింగు భాష్కర్‌, ప్రదాన కార్యదర్శి సింగు రవి, రాంగిరి నరేష్‌, ఓం ప్రకాష్‌, సింగు లక్ష్మీనారాయణ, నర్సయ్య తదితరులున్నారు.

కడెం: మండల కేంద్రంలోని టైలర్లు అంతర్జాతీయ టైలర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలియాస్‌ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌. నర్సయ్య, రాపర్తి నారాయణ, రాపర్తి వెంకటేష్‌, గట్ల నల్గొండ, రామగిరి రాజు, బ్రహ్మచారి, హబీబ్‌, రాజు, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:37:51+05:30 IST