‘విలియమ్స్‌ హో’కు రుణపడి ఉంటాం

ABN , First Publish Date - 2021-03-01T05:05:35+05:30 IST

కుట్టుమిషన్ల సృష్టికర్త విలియమ్స్‌ హోకు రుణపడి ఉంటామని టైలర్స్‌ మండల అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ఎస్‌కే సికిందర్‌ అన్నారు. గోపాలపురంలో మండల టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి టైలర్స్‌ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

‘విలియమ్స్‌ హో’కు రుణపడి ఉంటాం
దేవరపల్లిలో టైలర్ల ర్యాలీ

ఘనంగా టైలర్స్‌ డే వేడుకలు

జిల్లా వ్యాప్తంగా ఆదివారం టైలర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  ఆయా గ్రామాల్లో టైలర్లందరూ.. కుట్టుమిషన్ల సృష్టికర్త విలియమ్స్‌ హో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. 

గోపాలపురం, ఫిబ్రవరి 28: కుట్టుమిషన్ల సృష్టికర్త విలియమ్స్‌ హోకు రుణపడి ఉంటామని టైలర్స్‌ మండల అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ఎస్‌కే సికిందర్‌ అన్నారు. గోపాలపురంలో మండల టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి టైలర్స్‌ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 

దేవరపల్లి మండలంలో..

దేవరపల్లి, ఫిబ్రవరి 28: టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఏఎంసీ మాజీ చైర్మన్‌ కేవీకే దుర్గారావు అన్నారు. దేవరపల్లిలో ఆదివారం టైలర్స్‌డే సందర్బంగా శ్రీవినాయక దర్జీ సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు ఓరుగంటి వాసు అధ్యక్షతన ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీనియర్‌ టైలర్లను సన్మానించారు. దర్జీల సంఘం నాయకులు ఓరిగంటి వాసు, చాపల వెంకట్రావు, పి.వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కడిమి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:05:35+05:30 IST