కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-06-18T05:14:39+05:30 IST

కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి

కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి

టెక్కలి : సీతంపేట ఐటీడీఏ పరిధి వైటీసీలో సూపర్‌-60 బ్యాచ్‌ పేరుతో కోచింగ్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వినోద్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినా ఇక్కడ నిబంధనలు పాటించలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు కోచింగ్‌ నిర్వహించడంతో 28మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, తక్షణమే ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన వైద్య అందించి, కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహణకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ శిక్షణా కేంద్రం మూసివేయాలని, లేదంటే ఆందోళన చెస్తామని హెచ్చరించారు.


Updated Date - 2021-06-18T05:14:39+05:30 IST