అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు
కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు
వెంకటాచలం, మే 17 : ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా ముమ్మర చర్యలు చేపట్టాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. స్థానిక జగనన్న లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలను వేగంగా సమకూర్చాలన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ నరసింహులు, నెల్లూరు ఆర్డీవో పీ కొండయ్య, మండల ప్రత్యేక అధికారి రవీంద్ర, తహసీల్దారు ఐఎస్ ప్రసాద్, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, ఏఈ సీహెచ్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఏఈ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.