ఖరీఫ్‌ ధాన్య సేకరణకు పటిష్ట చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-10-02T05:02:29+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణకు పట్టష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరా లశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

ఖరీఫ్‌ ధాన్య సేకరణకు పటిష్ట చర్యలు తీసుకోండి
సమావేశంలో మాట్లాడుతన్న పౌరసరఫరాశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

 పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 1 : ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణకు పట్టష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరా లశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో శనివారం ఆయన 2022-23 ధాన్యం సేకరణపై పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో ధాన్యసేకరణలో ఎదుర్కొన్న  సమస్యలు పునరావృతం కాకుండా ఖరీఫ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ సక్రమంగా అమలు జరిగితేనే రైతుకు లాభం చేకూరుతుందన్నారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సమయం ఉన్నం దున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పౌరసరఫ రాలశాఖ వైస్‌-చైర్మన్‌, ఎండీ వీరపాండియన్‌ మాట్లాడుతూ  ఆర్బీకేలకు అనుసంధానంగా రైతులకు మేలు జరిగేలా ధాన్యం సేకరణలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, రైట్‌ అసిస్టెంట్‌లను నియమిస్తామన్నారు. అవసరమైతే సచివాలయ సిబ్బంది సేవలను కూడా వినియోగిస్తామన్నారు.  ధాన్యం నాణ్యత పరిశీలన, తూకం వేసి రైతులకు సంబంధిత కాపీని కూడా అందజేస్తామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మ నాథ్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రాజు, ఆర్డీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:02:29+05:30 IST