ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-18T05:29:21+05:30 IST

రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
గొల్లపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న మంత్రి

 మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల రూరల్‌,ఏప్రిల్‌ 17 : రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని గుల్లపేట గ్రామం లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాల న్నారు.  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మాట్లాతుతూ ప్రభు త్వం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తోందని అన్నారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల కోసం ఎన్నో సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టిందని, తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే ఆదర్శ పాలన అందిస్తోందని జడ్పీ చైర్‌ప ర్సన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీ ఏపీడీ వినోద్‌, డీఎస్‌వో చందన్‌, డీఏవో సురేష్‌కుమార్‌, ఎంపీపీ గంగా రాంగౌడ్‌, ఏఎంసీచైర్మన్‌ దామోదర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, గుల్లపేట సర్పంచ్‌ జక్కుల తిరుపతి, ఎంపీటీసీ దమ్మ సురేం దర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం ఓదెల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

గొల్లపల్లి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరిధాన్యం కొనుగోళ్లను జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌, కలెక్టర్‌ గుగులోతు రవితో కలిసి మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలకే వరి ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోస్కుల జలేంధర్‌, ఎంపీపీ శంకరయ్య, వైస్‌ ఎంపీపీ సత్తయ్య, ఏఎంసీ చైర్మన్‌ లింగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గంగాధర్‌, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేష్‌, పట్టణ శాఖ అధ్యక్షుడు తిరుపతి, డీఎం ప్రకాశ్‌, కార్యదర్శి రాజేంధర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కో-ఆర్డీనేటర్‌ కిష్టారెడ్డి, డైరెక్టర్లు సత్యానారాయణ గౌడ్‌, సత్తయ్య, వెంకటి,  వెంక టరమణ, జలేందర్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షులు రవీందర్‌, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు చందు, నాయకులు అశోక్‌ రావు, నారాయణరెడ్డి, జలేందర్‌, రాంచరణ్‌రెడ్డి,  వెంకటేష్‌, శోభన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T05:29:21+05:30 IST