కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-29T05:30:00+05:30 IST

సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్న కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు తెలిపారు.

కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పట్టణంలోని ముర్షద్‌గడ్డలో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 29: సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్న కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు తెలిపారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 28వ వార్డు ముర్షద్‌గడ్డలోని ఉర్సు ఫంక్షన్‌హల్‌లో కౌన్సిలర్‌ కలకుంట్ల మల్లికార్జున్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌తో కలిసి ఆమె కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సద్ది నాగరాజురెడ్డి, వడ్లకొండ సాయికుమార్‌ పాల్గొన్నారు.

పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 29: సిద్దిపేట పట్టణాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు తెలిపారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 19 అంశాలతో ఎజెండాను కౌన్సిల్‌ ముందు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 29: పట్టణంలో నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని సంతోషిమాత ఆలయం పక్కన నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్లను కమిషనర్‌ రవీందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:30:00+05:30 IST