ప్రభుత్వ వైద్యశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-24T05:37:42+05:30 IST

ప్రభుత్వం వైద్యశాలను ఆధునికీకరిస్తూ మొరుగైన సేవలు అందిస్తున్నందున ప్రజలు ప్రయివేట్‌ వైద్యం వైపు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని మాధవరం గ్రామంలో శుక్రవారం తాళ్లూరు పీహెచ్‌సీ వైద్యులు ఖాదర్‌ మస్తాన్‌బీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ వైద్యశాలను సద్వినియోగం చేసుకోవాలి
మందులు పంపిణీ చేస్తున్న ఎంపీపీ

తాళ్లూరు, సెప్టెంబరు 23 : ప్రభుత్వం వైద్యశాలను ఆధునికీకరిస్తూ మొరుగైన సేవలు అందిస్తున్నందున ప్రజలు ప్రయివేట్‌ వైద్యం వైపు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని మాధవరం గ్రామంలో శుక్రవారం తాళ్లూరు పీహెచ్‌సీ వైద్యులు ఖాదర్‌ మస్తాన్‌బీ ఆధ్వర్యంలో  వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన చికిత్స అందుతున్నందున ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీడీవో కె.యుగకీర్తి, సర్పంచ్‌ తాటికొండ రేణుక, మాజీమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఐ.వేణుగోపాల్‌రెడ్డి, మండల కోఆప్సన్‌ సభ్యులు కరిముల్లా, నుసుం ఆంజనేయులు, ఆరోగ్యసిబ్బంది తదితరులు పా ల్గొన్నారు.

మాధవరంలో 157 మందికి వైద్యపరీక్షలు

మాధవరం గ్రామంలో నిర్వహించిన వైద్యశిబిరంలో 157 మందికి పరీక్షలు జరిపినట్లు వైద్యాధికారి షేక్‌ ఖాదర్‌ మస్తాన్‌బీ తెలిపారు. 9 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారికి పరీక్షలు జరిపి మందులు అందజేశామన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌వో ప్రమీల, హెచ్‌ఈవో కొప్పోలు శ్రీనివాసరావు, సీహెచ్‌వో సైన్‌అదుల్‌, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌ ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:37:42+05:30 IST