కర్నూలు(కలెక్టరేట్),
జూన్ 25: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం జరిగే స్పందన
సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో
కోరారు. ఈకార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులంతా హాజరు కావాలని తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో,
నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథావిధిగా స్పందన కార్యక్రమాన్ని
నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.