స్పందనను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-05T06:20:29+05:30 IST

కలెక్టరేట్‌లోని సునయనలో ఈ నెల 6వ తేదీన నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు.

స్పందనను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 4: కలెక్టరేట్‌లోని సునయనలో ఈ నెల 6వ తేదీన నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు కలెక్టరేట్‌కు, మండల అధికారులందరూ తహసీల్దార్‌ కార్యాలయాలకు హాజరు కావాలని ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం స్పందన సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అర్జీదారులు మాస్కులు ధరించి హాజరు కావాలన్నారు. 

Updated Date - 2021-12-05T06:20:29+05:30 IST