జాగ్రత్త, చెన్నై... : రాహుల్ గాంధీ

Published: Thu, 11 Nov 2021 16:25:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జాగ్రత్త, చెన్నై... : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : చెన్నై నగరంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవిస్తుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావితులకు సహాయపడాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. భద్రత, రక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతూ గురువారం ఓ ట్వీట్ చేశారు. 


‘‘చెన్నైలో ఎడతెరిపిలేని వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని మన సోదర, సోదరీమణులను కోరుతున్నాను. సహాయ, ఉపశమన కార్యకలాపాల్లో ప్రజలకు సహాయపడాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నాను. జాగ్రత్త, చెన్నై!’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కూడా భారీ వర్షాలు కురిశాయి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.