టెన్త్‌పేపర్‌ లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-05-17T06:56:56+05:30 IST

ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లీక్‌ కాకుండా చర్యలు తీసు కోవాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆదేశించారు.

టెన్త్‌పేపర్‌ లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జిల్లా అధికారులు

విద్యాశాఖ కార్యదర్శి ఆదేశం

నిర్మల్‌ కల్చరల్‌, మే 16 : ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లీక్‌ కాకుండా చర్యలు తీసు కోవాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలు చేశారు. పరీక్ష ముగిసేందుకు అరగంట పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్ష హాల్‌ నుండి ఎవరిని బయటకు పోనివ్వరాదని, బయటి వారిని అనుమతించరాదన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్‌ షీట్లు భద్రత మధ్య తరలించాలన్నారు. జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వివరించారు. జిల్లాలో 9,719 మంది విద్యార్థులు హాజర వుతున్నారని 48 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్లు, డీఈవో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T06:56:56+05:30 IST