చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-26T06:39:38+05:30 IST

శిశు విహార్‌లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హరినారాయణన్‌ హెచ్చరించారు.

చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి : కలెక్టర్‌
వృద్ధాశ్రమంలో సూపరింటెండెంట్‌ రోహిణిని వివరాలు అడి గి తెలుసుకుంటున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు, మే 25: శిశు విహార్‌లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హరినారాయణన్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన శిశువిహార్‌, లక్ష్మీనగర్‌కాలనీలోని వృద్ధాశ్రమం,  ప్రధాన ఆస్పత్రి ఆవరణలోని వన్‌స్టాప్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. తొలిగా శిశువిహార్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం వన్‌స్టాప్‌ సెంటర్‌ను పరిశీలించారు. హింసకు గురైన మహిళలకు అందించే అత్యవసర సేవల గురించి లీగల్‌ కౌన్సిలర్‌, కేస్‌ వర్కర్లు కలెక్టర్‌ వివరించారు. స్ర్తీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్‌కాలనీలో నడుస్తున్న వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేశారు. వృద్ధులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేయిస్తున్నామని సూపరింటెండెంట్‌ రోహిణి, పీడీ నాగశైలజ కలెక్టర్‌కు వివరించారు.

Updated Date - 2022-05-26T06:39:38+05:30 IST