యూనివర్సిటీల్లో కొవిడ్‌ చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2021-04-21T05:05:26+05:30 IST

యూనివర్సిటీల్లో కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టాలని గవర్నర్‌ విశ్వభూషన్‌హరిచందన్‌ వర్సిటీల వైస్‌ చాన్సలర్లకు సూచించారు.

యూనివర్సిటీల్లో కొవిడ్‌ చర్యలు చేపట్టండి

 వీసీలతో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 

ఎచ్చెర్ల: యూనివర్సిటీల్లో కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టాలని గవర్నర్‌ విశ్వభూషన్‌హరిచందన్‌ వర్సిటీల వైస్‌ చాన్సలర్లకు సూచించారు. వీసీలతో మంగళవారం గవర్నర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ నివారణకు తీసుకోవల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలను గవర్నర్‌ వివరించారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు మాట్లాడుతూ, బోధనా సిబ్బంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా విధులు నిర్వ హిస్తున్నారన్నారు. బోధనేతర సిబ్బంది రోజు విడిచి రోజు 50 శాతం హాజ రయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో  వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య పాల్గొన్నారు. 

 జిల్లాలోని పరిస్థితిపై డీజీపీ  ఆరా

శ్రీకాకుళం ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 20: కరోనా బారిన పడకుండా తీసుకోవ ల్సిన జాగ్రత్తలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. జిల్లాల ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో కరో నా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సోకిన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని, వారికి అందిస్తున్న వైద్యాన్ని ఆయన తెలుసుకున్నారు.  జిల్లాలో కరోనా నిరోధానికి తీసుకుం టున్న చర్యలను ఎస్పీ అమిత్‌బర్దర్‌ డీజీపీకి వివరించారు. 


 

Updated Date - 2021-04-21T05:05:26+05:30 IST