Advertisement

జాగ్రత్తలు తీసుకోండి

Apr 23 2021 @ 23:38PM
మాట్లాడుతున్న సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ

హిరమండలం, ఏప్రిల్‌ 23: పాఠశాలల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున విద్యార్థినులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీవో పైడి వెంకటరమణ అన్నారు. శుక్రవారం స్థానిక కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రతి విద్యా ర్థిని 10వ తరగతి పరీక్ష ల్లో మంచి పాయింట్లు సాధించేలా కృషి చేయా లన్నారు. కరోనా బారిన పడ కుండా శానిటైజర్‌, మాస్కు వాడడంతో పా టు భౌతిక దూరం పాటించాలని సూచించా రు. కార్యక్రమంలో  ఎస్‌వో ఎస్‌.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 


 కరోనా బారిన పడి ఇద్దరు మృతి 

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా బారినపడి శుక్రవారం మృతి చెందారని ఎంపీడీవో ఆర్‌. కాళీప్రసాదరావు తెలిపారు. ఓ గ్రామానికి చెందిన 46 ఏళ్ల వయసున్న మహిళ రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మరో గ్రామానికి చెందిన 54 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి పాత్రునివలస క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నారన్నారు. వీరిద్దరు ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో మృతి చెందారని చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం మూడు గ్రామాలకు చెందిన ఆరు గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఎన్‌ఎన్‌పేట పీహెచ్‌సీ వైద్యులు టి.ప్రవల్లిక, రెడ్డి హేమలత చెప్పారు. పలు గ్రామాల్లో 40 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 


దుకాణాలు స్వచ్ఛందంగా మూత

మండల కేంద్రంలోని వ్యాపారులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట కు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో వారంతా ఒక నిర్ణయానికి వచ్చి దుకాణాలను ప్రతి రో జూ ఒంటి గంట వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, వీఆర్వో వి.రమేష్‌కుమార్‌కు తెలియజేయగా వ్యాపారులను వారు అభినందించారు. 


మందస మండలంలో 104 కేసులు 

మందస: మందస మండలంలో శుక్రవారం వరకు 104 కరోనా పాజి టివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ బి.పాపారావు తెలిపారు. హరి పురంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని చెప్పారు. 


పలాసలో 37 ...

పలాస రూరల్‌ : పలాస మండలంలో శుక్ర వారం 37 కరోనా కేసులు నమోదైనట్లు తహసీ ల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు తెలిపారు. శనివారం నుంచి విద్యాసంస్థలకు వారం రోజులు తాత్కాలిక సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.


పాతపట్నంలో 31..

పాతపట్నం: పాతపట్నం మండలంలో  శుక్రవారం 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  తహసీ ల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ తెలిపారు.  మేజర్‌ పంచాయతీలో-24,  ఒక గ్రామంలో 3, మరో మూడు గ్రామాల్లో నాలుగు కేసులను గుర్తించి తగు చర్యలు తీసుకున్నామన్నారు.  కేసులు పెరుగుతున్నందున  కరోనానిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతంగా చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 


జలుమూరులో 4...

జలుమూరు: మండలంలో శుక్రవారం 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ తెలిపారు. హెచ్చు పాజిటివ్‌ కేసులున్న 10 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి కొవిడ్‌ నిబందనలు అమలు చేస్తున్నామన్నారు. మండలంలో ఇప్పటివరకు 98 మంది కరోనా బారిన పడినట్లు చెప్పారు. వీరందరికీ హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య కార్యకర్తలు వైద్య సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.  


మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపారాలు 

టెక్కలి: కరోనా రెండో దశ నియంత్రణలో భాగంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు మాత్రమే దుకాణాలు తెరవాలని  తహసీల్దార్‌ శిర్ల గణపతిరావు తెలి పారు. పాలు, మెడికల్‌ షాపులకు మాత్రమే మినహాయింపు ఉందన్నారు. కాయ గూరలు, చేపలు, చికెన్‌, మట న్‌ షాపులు డిగ్రీ కళాశాల ఆవరణకు తరలించా మన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు శుక్రవారం స్థానిక డిపోలో వైద్య సిబ్బం ది కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు.  కరోనా సోకిన ఉద్యోగులకు 14 రోజుల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి స్థానికంగా విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని కార్మిక సంఘ నాయకుడు భూషణం కోరారు.  


స్టార్‌ హోటల్‌ తనిఖీ

 రాజాం రూరల్‌: కరోనా నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, సీఐ పి.శ్రీనివాసరావు హెచ్చ రించారు.  పాలకొండరోడ్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ను శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు.  కలెక్టర్‌ ఆదేశాల మేరకు మధ్యా హ్నం మూడు గంటల వరకే తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. హోటల్‌ గదుల్లో ఉన్న వారికి మినహా బయట వారికి అమ్మకాలు చేపట్టవద్దని సూచించారు. రూ.1000 జరిమానా విధిం చారు. వారితో పాటు సిబ్బంది ఉన్నారు.

 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.