రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-07-07T05:43:55+05:30 IST

రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలి

రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలి
మాట్లాడుతున్న మనోహర్‌రెడ్డి

కులకచర్ల, జూలైౖ 6: రైతులు ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని, అందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తుందని డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.55 వేల రుణం కల్పిస్తుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు రూ.100 కోట్ల రుణం కల్పిస్తామన్నారు. ఆ పంటను సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని తెలిపారు. కులకచర్లలోని రోడ్డు వెడల్పులో భాగంగా చౌరస్తా నుంచి పశువుల ఆసుపత్రి వరకు సైడ్‌డ్రైన్‌ నిర్మాణాలకు ఎమ్మెల్యే నిధులు రూ.15 లక్షలు, జీపీ నిధులు రూ.15 లక్షలు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేరి రాంరెడ్డి, సారా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:43:55+05:30 IST