రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-18T04:49:20+05:30 IST

రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిపాదనలు పంపాలని డ్వామా పీడీ శీనారెడ్డి తెలిపారు.

రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలి
కొత్తపాలెం వద్ద ఉపాధి పనులను పరిశీలిస్తున్న పీడీ

డ్వామా పీడీ శీనారెడ్డి               

తాళ్లూరు, మే 17: రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యతనిస్తూ  ప్రతిపాదనలు పంపాలని డ్వామా పీడీ శీనారెడ్డి తెలిపారు. కొత్తపాలెంలో జ రుగుతున్న ఉపాధి పనులను పీడీ మంగళవారం పరిశీలించారు.  కూ లీలు చేస్తున్న పనులు ప్రయోజనకంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకున్నారు. కూలి గిట్టుబాటు ఉందా లేదా అని తెలుసుకున్నారు. వాగులు, వంకల్లో పనులు చేసే బదులు రైతులకు ప్రయోజనకంగా వుండే పనులపై దృష్టి సారించాలని సిబ్బం దికి సూచించారు. కొత్తపాలెం గ్రామ ప్రజల తాగునీరు, భూగర్భ జలాలు వృ ద్ధి చెందేలా సంజీవయ్య కుంట ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆ కుంటను అభివద్ధి చేసేందుకు నిధులు మంజూరు చే యాలని జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి పీడీని కోరారు. ప్రతిపాదనలు పంపితే నిధుల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు ఈనెల 4వ తేదీ వరకూ విడుదలైనట్లు పీడీ తెలి పారు.  గ్రామంలో కె.సుబ్బారెడ్డి ఉద్యానవనశాఖ సహకారంతో నాటిన నిమ్మతోటను పరిశీలించారు. ఉ ద్యాన పంటలకు ఉపాధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బి ల్లులు అందలేదని రైతులు పీడీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మేకల చార్లెస్‌ సర్జన్‌, వైస్‌ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, ఏపీడీ లలితకుమారి, ఎంపీ డీవో కోటేశ్వరరావు, ఏపీవో మురళీకృష్ణ, ఈసీ ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T04:49:20+05:30 IST