వివాహితపై వల.. బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం.. విషయం భర్తకు తెలిసి..

ABN , First Publish Date - 2022-04-29T23:39:16+05:30 IST

ఆమె వివాహిత.. తన స్వగ్రామానికి చెందిన యువకుడితో అప్పుడప్పుడు మాట్లాడుతుండేది..

వివాహితపై వల.. బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం.. విషయం భర్తకు తెలిసి..

ఆమె వివాహిత.. తన స్వగ్రామానికి చెందిన యువకుడితో అప్పుడప్పుడు మాట్లాడుతుండేది.. దానిని అలుసుగా తీసుకుని ఆ యువకుడు నేరుగా ఆమె అత్తింటికి వెళ్లిపోయాడు.. ఒక్కసారి మాట్లాడాలని చెప్పి ఆమెను అడవిలోకి తీసుకెళ్లాడు.. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటనను వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.. తనకు అవసరమైనప్పుడల్లా ఆమెను పిలిచేవాడు.. దీంతో ఆమె తన భర్తకు విషయం చెప్పేసింది.


హర్యానాలోని పల్వాల్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన గ్రామానికే చెందిన యువకుడితో అప్పుడప్పుడు మాట్లాడుతుండేది. ఒకరోజు ఆమె పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తుండగా అతను వెంబడించాడు. నేరుగా ఆ మహిళ అత్తింటికి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ కంగారు పడింది. ఒక్కసారి మాట్లాడాలని చెప్పి ఆమెను అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను అత్యాచారం చేశాడు. ఆ ఘటనను మొబైల్‌తో వీడియో తీశాడు. 


ఆ వీడియోను చూపించి బాధిత మహిళను బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత పలుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి వేధింపులను భరించలేకపోయిన మహిళ విషయం మొత్తం తన భర్తకు చెప్పేసింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-29T23:39:16+05:30 IST