బంజారాహిల్స్‎లో టీఆర్ఎస్ ఆఫీసుకు భూమి.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు

Published: Thu, 23 Jun 2022 18:55:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బంజారాహిల్స్‎లో టీఆర్ఎస్ ఆఫీసుకు భూమి.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు

హైదరాబాద్:  తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ (Trs) ఆఫీసుకు భూమి కేటాయింపుపై నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ఆఫీసుకు బంజారాహిల్ (BanjaraHills)‎లో 4 వేల935 గజాల భూమి (Land)ని ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో గజాన్ని రూ.100కు అప్పగించింది. దీంతో పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎలా ఇస్తారని ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr)‎తోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సీఎస్ (Cs), హైదరాబాద్ కలెక్టర్ (Collector)‎కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 


తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించాలని గతంలో సీఎం నిర్ణయించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయించారు. అయితే తక్కువ ధరకు భూమి కేటాయించడంపై అప్పట్లోనే పలువురు విమర్శలు చేశారు. కోట్ల విలువైన స్థలాలను పార్టీ ఆఫీసులకు తక్కువ ధరకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.