
హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం ఏం ఒరగబెట్టిందో బీజేపీ నేతలకు చెప్పే దమ్ముందా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జూ పార్క్లో ఉన్న జంతువుల్లాగా బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 6 మండలాలను బలవంతంగా లాక్కున్నారని, ప్రధాని కొత్త డ్రామాకు తెరలేపారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే మోదీ కొత్త రాగం అందుకున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ తుంగలో తొక్కారన్నారు. సింగరేణి జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.