గ్రూప్‌ 1లోనూ ప్రతిభ

ABN , First Publish Date - 2022-07-06T05:48:34+05:30 IST

ఇటీవల ఐఎఫ్‌ఎస్‌లో 34వ ర్యాంకు సాధించిన యువకుడు మంగళవారం విడుదలైన గ్రూప్‌ 1 ఫలితాల్లోనూ ప్రతిభ చూపి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారం వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు ఎంపి కైనప్పటికీ ఆ యువకుడు తన ధ్యేయం ఐఏఎస్‌ అని అంటున్నారు. వివరాలు ఇలా..

గ్రూప్‌ 1లోనూ ప్రతిభ

డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైన వెంకటరమణాకాంత్‌రెడ్డి 

చెన్నూరు, జూలై 5: ఇటీవల ఐఎఫ్‌ఎస్‌లో 34వ ర్యాంకు సాధించిన యువకుడు మంగళవారం విడుదలైన గ్రూప్‌ 1 ఫలితాల్లోనూ ప్రతిభ చూపి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారం వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు ఎంపి కైనప్పటికీ ఆ యువకుడు తన ధ్యేయం ఐఏఎస్‌ అని అంటున్నారు. వివరాలు ఇలా.. 

చెన్నూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన గాజులపల్లి వెంకటరమణారెడ్డి స్వగ్రామం కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామం. ప్రస్తుతం కడప నగరంలో నివాసం ఉంటున్నారు. ఈయన కుమారుడు వెంకటరమణాకాంత్‌రెడ్డి గ్రూప్‌-1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. మొత్తం 30 పోస్టులు ఉండగా జనరల్‌ కేటగిరిలో 9 మందిని ఎంపిక చేయగా అందులో వెంకటరమణాకాంత్‌రెడ్డి ఒకరు. గత వారం వచ్చిన రిజల్టులో ఇతను ఇండియన్‌ ఫారెస్టు సర్వీసులో 34వ ర్యాంకు సాఽధించారు. ఈ యువకుని తండ్రి ఖాజీపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పని చేస్తుండగా తల్లి లక్ష్మినారాయణమ్మ గృహిణి. ఈయన బీటెక్‌, ఎంటెక్‌, ఐఐటీ ఢిల్లీలో చదివారు. చదువు పూర్తి కాగానే కొంతకాలం జపాన్‌లోని డైకెన్‌ ఎస్‌లో పనిచేశారు. అయితే ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో స్వదేశానికి చేరుకుని ఢిల్లీలోని వాజీరామ్‌ రవి కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నారు. నాలుగుసార్లు సివిల్స్‌ పరీక్షలు రాయగా తృటిలో ఇంటర్వ్యూలో ర్యాంక్‌ చేజారింది. అయితే ఐఎ్‌ఫఎ్‌సలో మాత్రం రెండవ ప్రయత్నంలోనే 34 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం గ్రూప్‌ 1కు సంబంధించి జనరల్‌ కేటగిరిలో ఎంపికై డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు సాధించారు. 


ఐఏఎస్‌ కావడమే లక్ష్యం

వారం వ్యవధిలోనే రెండు ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. రెండూ కూడా పెద్ద ఉద్యోగాలే. కానీ నా లక్ష్యం మాత్రం ఐఏఎస్‌. ఇటీవల ప్రిలిమ్స్‌ క్వాలిఫె అయ్యాను. సెప్టెంబర్‌లో జరిగే మెయిన్స్‌కు సిద్ధమవుతు న్నాను. నేను ఈ స్థాయికి రావడానికి నా తల్లిదండ్రులతో పాటు తాతగారైన చెన్నూరు మండలం ఉప్పరపల్లె మాజీ సర్పంచ్‌ జి.జయరామిరెడ్డి (జీజేఆర్‌), చిన్నాన్న జగన్‌మోహన్‌రెడ్డిల ప్రోత్సాహం ఎంతో ఉంది.

- గాజులపల్లి వెంకటరమణాకాంత్‌రెడ్డి, గ్రూప్‌ 1 ర్యాంకర్‌


కల్లూరుపల్లె తాండా వాసికి..

చక్రాయపేట, జూలై 5: మండలంలోని కల్లూరుపల్లె తాండాకు చెందిన విష్వక్సేనుడు వినోద్‌ గ్రూప్‌-1 పోస్టుకు ఎంపికయ్యారు. ఈయన తండ్రి బుక్కే పురుషోత్తం నాయక్‌ లక్కిరెడ్డిపల్లెలో ఏఎ్‌సఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగరీత్యా ప్రస్తుతం రాయచోటిలో నివాసం ఉంటున్నారు. విష్వక్సేనుడు వినోద్‌ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేటలో స్టేట్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్షలు రాయగా అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకు ఎంపికయ్యారు. 

Updated Date - 2022-07-06T05:48:34+05:30 IST