ఇంటర్‌ ఫలితాల్లో సర్కారు విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-06-29T04:37:26+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలోని సర్కారు కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌కు ధీటుగా రాణించా రు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ ఫలితాలను వి డుదల చేయగా కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలు ఇంటర్‌ విద్యార్థులను ప్రభుత్వం పై తరగతులకు ప్రమోట్‌ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాగా 2019-20 విద్యాసంవత్సరం అనంతరం ప్రస్తుత ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు.

ఇంటర్‌ ఫలితాల్లో సర్కారు విద్యార్థుల ప్రతిభ

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌28: ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలోని సర్కారు కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌కు ధీటుగా రాణించా రు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ ఫలితాలను వి డుదల చేయగా కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలు ఇంటర్‌ విద్యార్థులను ప్రభుత్వం పై తరగతులకు ప్రమోట్‌ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాగా 2019-20 విద్యాసంవత్సరం అనంతరం ప్రస్తుత ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు. ఇంటర్‌ జనరల్‌ కోర్సు ప్రథమ సంవత్సరంలో 64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా రాష్ట్ర స్థా యిలో 9వ స్థానంలో నిలవగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8వ స్థా నంలో నిలిచారు. మొత్తం 68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. ఒకేషనల్స్‌ కోర్సుల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 2వ స్థానంలో నిలవగా 74 శాతం విద్యార్థులు ఇందులో ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ స్థానం లో రాష్ట్రస్థాయిలో ఒకేషనల్‌ కోర్సులకు గాను జిల్లా 3వ స్థానంలో ని లవగా 63 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 

పర్వాలేదనిపించిన విద్యార్థులు..

ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థులు పర్వాలేదనిపించారు. 2019-20 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 62శాతం ఉత్తీర్ణత సాధించగా ఈఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో మొత్తం 9085 మంది పరీక్షలకు హాజరు కాగా 5890 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 64 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో 8533 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5867 మంది పాస్‌ కాగా 68శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 4596 మందికి 2652 మంది పాసై 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల్లో 4489 మంది ప రీక్షలు రాయగా 3238 మంది పాసై 72శాతం ఉత్తీర్ణత నమోదు చేశా రు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 4380 మందికి గాను 2748 మంది పాస్‌ కాగా 62శాతం ఉత్తీర్ణత, బాలికల్లో 4153 మంది పరీక్షలు రాయగా 3126 మంది పాసై 75శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలికలు బాలురపై పైచేయి సాధించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఐఈఓ రవీందర్‌కుమార్‌ తెలిపారు. జూన్‌ 30 నుంచి జూలై 6 వరకు పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా రీకౌంటింగ్‌ వెరిఫికేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో జూలై 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని తెలిపారు. రీకౌంటింగ్‌ కోసం సబ్జెక్టుకు రూ.100 చొప్పున, వెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ.600 చొప్పున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

Updated Date - 2022-06-29T04:37:26+05:30 IST